మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Raghava Ashtakam – శ్రీ రాఘవాష్టకం
రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం
జానకీవదనారవిందదివాకరం గుణభాజనమ్ |
వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరమ్ || 1 ||
మైథిలీకుచభూషణామల నీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతమ్ |
నాగరీవనితాననాంబుజబోధనీయకలేవరం
సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరమ్ || 2 ||
హేమకుండలమండితామలకంఠదేశమరిందమం
శాతకుంభ మయూరనేత్రవిభూషణేన విభూషితమ్ |
చారునూపురహారకౌస్తుభకర్ణభూషణభూషితం
భానువంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరమ్ || 3 ||
దండకాఖ్యవనే రతామరసిద్ధయోగిగణాశ్రయం
శిష్టపాలనతత్పరం ధృతిశాలిపార్థకృతస్తుతిమ్ |
కుంభకర్ణభుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరమ్ || 4 ||
కేతకీకరవీరజాతిసుగంధిమాల్యసుశోభితం
శ్రీధరం మిథిలాత్మజాకుచకుంకుమారుణవక్షసమ్ |
దేవదేవమశేషభూతమనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరమ్ || 5 ||
యాగదానసమాధిహోమజపాదికర్మకరైర్ద్విజైః
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితమ్ |
తాటకావధహేతుమంగదతాతవాలినిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరమ్ || 6 ||
లీలయా ఖరదూషణాదినిశాచరాశువినాశనం
రావణాంతకమచ్యుతం హరియూథకోటిగణాశ్రయమ్ |
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్యవిచక్షణం ప్రణమామి రాఘవకుంజరమ్ || 7 ||
కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం
చారుహాసమనాథబంధుమశేషలోకనివాసినమ్ |
వాసవాదిసురారిరావణశాసనం చ పరాంగతిం
నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరమ్ || 8 ||
రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయసాధకం
ముక్తిభుక్తిఫలప్రదం ధనధాన్యసిద్ధివివర్ధనమ్ |
రామచంద్రకృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
రామచంద్రపదాంబుజద్వయ సంతతార్పితమానసః || 9 ||
రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే |
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే || 10 ||
ఇతి శ్రీ రాఘవాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.